Saturday, August 23, 2008

Bhaavaaveesam

హాయ్
అమ్మ--- గురు చరణ్
అమ్మ గొప్పతనం ఏంటి ? అన్న మీ ప్రశ్నకు నా సమాధానం నిశబ్దం అవతుంది,ఎందుకంటే ఎక్కడ నుంచి మొదలెట్టాలో తెల్చుకోలేను కనుక !!!"

ప్రేమ--- గురు చరణ్
ప్రేమ proove అవ్వాలి ...proove చేసుకోకూడదు ........

ప్రేమ-- గురు చరణ్
"ప్రేమించడం ఆపేస్తే పెద్ద బాధ ఏమి వుండదు ర ....ప్రేమించబడడం ఆగిపోతే చాలా బాధగా వుంటుంది "

guru
"నా మౌనం చేతకాని తనం అనుకుంటే ...నా చేతులు మౌనం వహించవ్ "

అమ్మ - గురుచరణ్
"అమ్మ అందరికి వుంటుంది కాని అమ్మతనం అందరికి వుండదు "

లవ్ - గురుచరణ్
"నా వ్యాపకమే నువ్ అవుతావు అనుకున్నా ,ఇలా జ్ఞాపకం అవుతావ్ అనుకోలేదు "

క్యారెక్టర్ - గురుచరణ్
"నేను మోహ మాటానికి ప్రేమించను ,ప్రేమించటానికి మొహమాట పడను"

కంట్రీ- గురుచరణ్
"దేశాని కన్నా ..దేశ భక్తుడు మిన్న "

పంచాయితి పెద్ద డైలాగ్ -గురుచరణ్
""తప్పు చేసిన వాడి స్థానం లో వున్నది నా రక్తం పంచుకున్న వాడైనా నాకు రక్తం పంచిన వాడైన సరే క్షమించను."

సక్సెస్-- గురు చరణ్
"ఓటమి ఎరుగవు అంటే గెలుపులోని తియ్యదనం పూర్తిగా తెలీదు అని అర్థం "

చిరు పొలిటికల్ ఎంట్రీ --- గురుచరణ్
"అతని మౌనమే రాష్ట్రాన్ని ఏలుతుంది ...ఇక పెదవి విప్పితే ప్రభుత్వం ఏర్పడదా .."

లవ్ ---గురుచరణ్
"ప్రేమ లోనూ పేకాటలోనూ ప్రతీ సారీ గెలవలేమ్"

క్రియేటివ్-- గురు చరణ్
"even though you COPY the imagination still its CREATIVITY"

భాద ---గురుచరణ్
"కంచం ముందు చెయ్యి తడిగా వుండాలి కాని కళ్లు తడిగా వుండ కూడదు "

లవ్ ---గురుచరణ్
ప్రేమించటానికి ప్రేమించటం తెలియాలి కాని నీ గురించి తెలియక్కర లేదు "

daughter says to his Father--- గురుచరణ్
"ప్రేమ అనే ముసుగులో మోసం చేయ్యమన్నావ్ ,మోసం అనే ముసుగులో ప్రేమించా"

తపన -----గురుచరణ్
"నా రాతలు నిజం కాక పొవచు ,కాని రాయాలన్న నా తపన మాత్రం నిజం .

సందర్భం -----గురుచరణ్
"ప్రేమ కి నమ్మకం ఎంత ముఖ్యమో,సామెత కి సందర్భం అంత ముఖ్యం "

స్నేహం ------గురుచరణ్
"సాయం చేసి ఆశిస్తే తప్పు ,స్నేహం చేసి ఆశిస్తే తప్పులేదు "

తపన -----గురుచరణ్
"ఎందుకు తపన తీరలేదు అనే బాధ ,తపన వుండటమే అదృష్టం కాదా ?"

విలువ ----గురుచరణ్
"విలువలు కాపాడాలి అనుకునే వారికి విలువ లేదు "

మోసం ----గురుచరణ్
"నమ్మిన వారిని చంపడం కన్నా పెద్ద నేరం ,వారిని మోసం చేయడం "

ప్రేమ ---గురుచరణ్
"ప్రేమ నటించటం కష్టం ,ప్రేమించటం తేలిక "

Romantic One------గురుచరణ్
"నీ తలపే నాకు ఇంధనం ,నీ వలపుకు చేస్తా వందనం ":-)

డైలాగ్ లాంటిది -----గురుచరణ్
"మనం infosys లో పని చేస్తున్న TCS లో పని చేస్తున్నా .....తుమ్మినప్పుడు మాత్రం ......SATYAM అనే అంటారు ":-)

అమ్మ ----గురు చరణ్
"మా అమ్మ మొహం లో చిన్న పాటి కంగారుకు కారణం నా ఆనందభాష్పాలు ఐతే అవి నాకు వద్దు "

తొందరపాటు -------గురుచరణ్
"ఆశ పడు ఆత్ర పడకు "

ఓటమి ------గురుచరణ్
"నేను తప్పు ఒప్పుకుంటాను కాని ఓటమిని ఒప్పుకోను "

ఓటమి ------గురుచరణ్
"ఊతమిని మరిచిపో ,అది నేర్పిన పాఠాన్ని మరువకు "

కష్టాలు------గురుచరణ్
"దేవుడా ప్రత్యక్షం అవ్వయ్యా అంటే ప్రతిపక్షం అయ్యావా ?"
a Film producers says to audience--గురుచరణ్
"Theater లో మీ రెండు వెళ్ళు నోట్లోకి వెళితేనే మా నాలుగు వేళ్ళు నూట్లోకి వెళ్తాయి "

Ability----గురుచరణ్
"నాకు ఈ ప్రపంచం లో చేతకానిది ఒక్కటే చేత కాదు అని చెప్పటం "

అందం ----గురుచరణ్
"అందం ఆకర్షించటానికి పనికొస్తుంది కాని అర్థం చేసుకోవటానికి పనికి రాదు"

భార్య ------గురుచరణ్
"పెళ్ళికి ముందు ఓ చూపు చూసింది పడిపోయా ,ఇప్పుడు ఓ చూపు చూసుకుంటోంది ";-)

Talent----గురుచరణ్
"నీలో talent వుంది అని నువ్వు నమ్ము ,తరవాత ఈ దేశమంతా నిన్నే నమ్ముకుంటుంది "

Work----గురుచరణ్
"చేసే పని ని ప్రేమించకు , ప్రేమించే పనినే చెయ్యి "

Leadership----గురుచరణ్
"దారి చూపటానికి అర్హత వుండాల్సిన అవసరం లేదు ,ఆలోచన వుంటే చాలు "

Feedback----గురుచరణ్
"అభినందిస్తే ఆనందిస్తా ,విమర్శిస్తే ప్రశంసిస్త !!"

NRI says----గురుచరణ్
"మేము దేశానికి దూరంగా వుంటున్నాం ,దేశ భక్తి కి దూరంగా వుండట్లేదు "

Interest----గురుచరణ్
"అభిరుచి వుండాలి కాని అసాధ్యం అంటూ వుండదు "

గెలుపు ----గురుచరణ్
"మన గెలుపు మన కంటే ముందుగా మన ప్రత్యర్థులకు తెలియాలి "

Cast----గురుచరణ్
"Cast మనుషులని CATOGARISE చేస్తుంది కాని DIFFERENTIATE చెయ్యదు "

use her name----గురుచరణ్
"మీకు ఏ పని అవ్వలన్నా ఆ పని తనది అని చెప్పండి ,అయిపోతుంది ":-)

Comparing----గురుచరణ్
"పోల్చుకుంటూ బ్రతికితే ,తరవాత తలచుకోవటానికి ఏమీ వుండదు "
స్నేహం ----గురుచరణ్ "ఆకలి రుచి ఎరుగదు ,నిద్ర చోటు ఎరుగదు ,స్నేహం మతం ఎరుగదు "

నిరుద్యోగి ----గురుచరణ్
"నిరుద్యోగి ఆకలేస్తే అన్నం దొరకాలి అనుకోడు ,పని దొరకాలి అనుకుంటాడు "

పోరాటం ----గురుచరణ్
"ఆస్తులు కోసం పోరాడకండి ఆశయాల కోసం పోరాడండి "

Control----గురుచరణ్
"ఇంద్రియాలను నియంత్రించ గలిగిన వాడు ప్రపంచాన్ని శాసించగలడు "

Abt me----గురుచరణ్
"ఊహలు నా నేస్తాలు ,ఆలోచనలు నా బంధువులు,రాతలు నా తీపి గుర్తులు "

Goal----గురుచరణ్
"కలలో కూడా నీ కలను మరువకు "

Love----గురుచరణ్
"మనం రోజు లో ఎన్ని సార్లు మాట్లాడుకున్నాం అనేది కాదు ,నిమిషానికి ఎన్ని సార్లు ఒకరినొకరు తల్చుకున్నాం అనేది ముఖ్యం "

కార్య సాధకుడు ----గురుచరణ్
"జైత్ర యాత్ర చెయ్యాలనుకునే వాడు తీర్థయాత్రలు చెయ్యడు"

Friends----గురుచరణ్
"మనం కలవటం దైవ నిర్ణయం కావచ్చు ,కాని విడిపోవటం మాత్రం మన నిర్ణయం అవ్వాలి "

తప్పు ----గురుచరణ్
"తప్పు ఒప్పుకోవటం సగం దిద్చుకోవడంతో సమానం "

అలక ----గురుచరణ్
"అలక లో తన కోపం చూడకు ,బతిమాలుకుంటాడు అనే నమ్మకం చూడు "

no pains no gains----గురుచరణ్
"రాయి ఉలిని వలచింది మూర్ఖంగా ,ఉలి రాయిని మలిచింది శిల్పంగా "

అమ్మ ----గురుచరణ్
"అమ్మ యిచ్చిన తొలి వరం జన్మ ,జన్మించిన తొలి పదం అమ్మ "

+ve thinking of a blind person----గురుచరణ్
"సూర్యుడు చీకటితో పోరాడ గలడు చీకటి లో పోరాడలేడు,కాని నేను రెండూ చెయ్యగలను "

విలువ ----గురుచరణ్
"Bullet లేధు అని తెలిసే దాకా గన్ను కి విలువ ,మనసు లేదు అని తెలిసే దాకా మనిషికి విలువ "

శృంగారం ----గురుచరణ్
"అంగ సౌష్టవం లో ఏముంది విశిష్టత,మనలో వుండాలి రసికత ":ప

between friends----గురుచరణ్
"ఓ దూరం మన మధ్య వచ్చి తప్పు చేసింది ,దాన్ని పెంచి మనం తప్పు చేయకూడాదు "

soldier----గురుచరణ్
"కధ అన్నాక ముగింపు వుండాలి ,సైనికుడు అన్నాక తెగింపు వుండాలి "
"చమట ఉప్పగా వుంటుంది ,కాని అది అందించే గెలుపు తియ్యగా వుంటుంది "

Philosophy----గురుచరణ్
"అప్పుడప్పుడు వేదాంతం మాట్లాడే వాడు మనిషి ,ఎల్లప్పుడూ వేదాంతం మాట్లాడే వాడు ఋషి "

Satisfaction----గురుచరణ్
"గెలవడం లో సంతోషం వుంటుంది ,నిజాయితి గా గెలవడం లో సంతృప్తి వుంటుంది "

గొప్పవారు ----గురుచరణ్
"గొప్పవాడు విమర్శల కోసం చూస్తాడు ,గొప్ప అవ్వాలి అనుకునే వాడు పొగడ్తల కోసం చూస్తాడు "

లవ్ ----గురుచరణ్
"నాయకుడు ఎక్కడున్నా నాయకుడే ,ప్రేమికుడు ఎక్కడున్నా ప్రేమికుడే "

కళల (art)----గురుచరణ్
" కోయిల అరిచినా పాట అనుకుంటారు ,కాకి పాడినా అరుపు అనుకుంటారు ........కాకి పాటని కూడా గుర్తించండి ,కళలను ఎక్కడున్నా ఆదరించండి "

విజయాలు ----గురుచరణ్
"సాధించిన విజయాలన్నింటిని తలచుకుంటున్నావ్ అంటే ఇప్పుడు నువ్వు ఖాళీగా వున్నావ్ అని అర్థం "

Excusing----గురుచరణ్
"సాయం చేసిన వాడిని మోసం చేసిన వాడిని ఎప్పటికీ మరిచిపోకు ,సాయపడిన వాడిని దీవిస్తూ వుండు ...మోసం చేసినవాడిని క్షమిస్తూ వుండు "

అమ్మ ----గురుచరణ్
"ఎంతమందిలో అయినా ,నువ్వు ఎంత వాడివి అయినా..అమ్మ తిడితే అవమానం అనుకోకు ఆశీర్వాదం అనుకో "

లవ్ ----గురుచరణ్
"ప్రేమించిన మనిషి మోసం చెయ్యచ్చు ,కానీ ప్రేమించిన మనసు మోసం చెయ్యదు ..మోసం నీది , మనసు నాది "

కోపం ----గురుచరణ్
"నీ కోపానికి విలువ లేదు అంటే ,నీకు విలువ లేనట్టే "

అందం ----గురుచరణ్
"అందం గుణంతో ముడిపడి లేదు ,మన చూపుతో ముడిపడి వుంది "

సాయం ----గురుచరణ్
"నాకు సాయం చేస్తే నీకు పుణ్యం వస్తుంది కాని ,నా మీద హక్కు రాదు "

జీవితం ----గురుచరణ్
"వింతలన్నీ ఓ చోట వుంటే Museum అంటారు ,చింతలన్ని ఓ చోట వుంటే .......జీవితం అంటారు "

దేశం ----గురుచరణ్
"దేశం అంటే అభిమానం వుండాలి ,దేశాన్ని ఏమైనా అంటే ఆవేశం రావాలి "

దురదృష్టం ----గురుచరణ్
"అతి పెద్ద దురదృష్టం ..నీకు కోపం వచ్చింది అని నువ్వే చెప్పుకోవాల్సి రావడం "

అడ్డంకులు -- గురుచరణ్
"నీ దారిలో ముళ్ళు వుంటే భయపడకు, ముళ్ళు లేకుంటే భయపడు"

ప్రేమ ----గురుచరణ్
"బద్ధకం నిర్లక్షం కొంత పని కూడా చేయనియ్యవు ,కాని ఆకలి, ప్రేమ ఎంత పనైనా చేయిస్తాయి"

మాటలు ----గురుచరణ్
"మన మాటలు మనసు కి హతుకునే లా వుండాలి ,మనసుకి గుచ్చుకునేలా వుండకూడదు "

బాష ----గురుచరణ్
"బెదిరింపుకు భాష అవసరం లేదు ,కాని ......ఓదార్చటానికి అది చాలా అవసరం "

లాభం ----గురుచరణ్
"వ్యాపారం లోనూ శృంగారం లోనూ ఎవరి లాభం వారు చూసుకోవాలి "

కోపం-- గురు చరణ్
"కోపం ఒస్తే తప్పు కోపం తెచ్చుకుంటే తప్పు "

Capacity----గురుచరణ్
"డబ్బులు లేని వాడే పేదవాడు అవుతాడు కాని పిరికి వాడు కాదు ,కాలు లేని వాడు కుంటి వాడు అవుతాడు కాని చేత కాని వాడు కాదు "

ప్రేమ ----గురుచరణ్
"నీ ప్రేమ నేగ్గదు" అని జోస్యం చెప్పాను తను నెగ్గించుకుని ప్రేమ కి భాష్యం చెప్పింది ..

ప్రేమ -- గురుచరణ్
శిక్షించావు నన్ను ఏ నేరాన ??
ఐనప్పటికీ నీతోనే రానా !!!

బాధ -- గురుచరణ్
సుఖల్లోనే నవ్వాలి అనుకున్నా కాని నవ్వలేకపోయా.. బాధలోనే నవ్వాలి అనుకున్నా ..నవ్వుతూనే వున్నా ..

భయం-- గురుచరణ్
భయపడే వారిని భయపెట్ట కూడదు, భయపెట్టే వారిని భయపెట్టాలి ..

ఓ తండ్రి మాట -- గురుచరణ్
ఎనిమిదేళ్ల కొడుకు చనిపోతే.. ఏనిమిదేళ్ళ తర్వాత తుఫ్ఫాను ఒస్తే ఎలా వుంటుందో అలా వుంటుంది ..
ఇరవైమూడేళ్ళ కొడుకు చనిపోతే, తుఫ్ఫాను వచ్చి ఇరవైమూడేళ్ళు వుంటే ఎలా వుంటుందో అలా వుంటుంది..

సాయం--గురుచరణ్
ఏప్పుడైనా సాయపడతాడు అని పరిచయం చేసుకోకు, ఏప్పుడైనా సాయపడదాము అని పరిచయం చేసుకో...

blaming--gurucharan
మంచి జరిగినపుడు అంతా నీవల్లే అనకపోయినా పర్లేదు..చెడు జరిగినపుడు మాత్రం అంతా నీవల్లే అనకూడదు..

లవ్--గురుచరణ్
కలిసి బ్రతుకు పంచుకుంటాం అనుకున్నాము. ఇలా బాధ పంచుకుంటాం అనుకోలేదు..

మాట -- గురుచరణ్
ఎం మాట్లాడుతున్నావో తెలిసినపుడు, ఎవరితో మాట్లాడుతున్నావో తెలియాల్సిన అవసరం లేదు..

ప్రేమ-- గురుచరణ్
ప్రేమించే వారికే ప్రేమను ఆశించే హక్కు వుంటుంది

3 comments: