Wednesday, May 19, 2010

Mango People


Context: Oka Maamidi pandu(Mango) inkoo maamidi pandu ki raasinaa Preemaleekhaa


'రస'వత్తరమైన  నా  భామిని కి ,
ఫల్రాజా ప్రేమ కారిపోతూ  రాయుచున్న  ప్రేమలేఖ...
అసలు  నీ  problem ఏంటి ?? Caste problemaa?? నేను  పచ్చగా వుంటాను  నువ్వూ  పచ్చగానే ఉంటావుగా ...కాకపోతే  నేను  "పస్సుపచ్చ" నువ్వు "ఆకుపచ్చా" ...మా  Caste "బంగినపల్లి " మీ caste "బేనీష" అంతేగా !!...అయిన  బాగా  దగ్గర వాళ్ళమే గా ...మొన్నటికి  మొన్నా  ఆ  "మల్గూబా" ఇంక "రసాల్" పెళ్లి చేసుకోలేదా  ఏంటి ??....మరి  నీ problem
ఏంటి? మీ నాన్న ఒప్పుకోడనా ??....వాడికి  " మోట్టే " పగులుద్ది  అని  చెప్పు ...ఇంకా  మీ  అన్న తో  problemaa??..వాడిని  మామిడి  పండు  పిసికినట్టు  పిసికి  చంపుతాను  అని  చెప్పు ...వాడు  వాడి  మచ్చలూ...పిండితే  పావు  glassu juice కూడా  రాదూ  వాడికేంట problem??....ఇక  మీ  అమ్మా ??..దాని  బొంద ..దాన్ని  ఇప్పటికే  ఇద్దరు  రాళ్ళతో  కొట్టారు ...రేపూ  మాపో అనేట్టుంది దాని  పరిస్థితి  దానికేందుకీ  Caste feeling?...తొడిమ కోసి చేతిలో పెడతా అని చెప్పు ....అయినా నాకేం తక్కువా..పైగా ఈ మధ్య market లో నా rate పెరిగిందంట...నాకు నీ  rate ఎంతో కూడా తెలీకుండా ప్రీమించాను ...చూసావా ? నా ప్రేమ లో నిజాయితి...నువ్వు  NO అన్నావ్ అనుకో నా మీదా నిన్న కొట్టిన పురుగుల మందు వుంది అది నాకి  సచ్చిపోతా :(   నువ్వు  YES అన్నావ్  అనుకో  మన  పెళ్లికి  నేను అందరికి MangoFruity లు పంచిపెడత...నువ్వు ఈ మధ్య ఆ "తోతాపూరి "గాడి మీద interest చూపిస్తున్నావ్  అని తెలిసింది ...నాకు వాడి లాగా Body లేదు అదేనా నీ problem??....నిజమే  నేను aaam aadhmini...కాని వాడికన్నా ఎక్కువ Juice వుంది నా దగ్గరా..కావాలంటే "Glass పట్టుకు రా " Your browser may not support display of this image. .....భామిని  plzzz భామిని  ఒప్పుకో   భామిని  నా  'పండు'భామిని ...నాకు  పులుపు  అంటే ఇష్టం  లేకున్నా  ..నీకు  పులుపు  బలుపు  వున్నాయ్ అని తెలిసి కూడా నిన్ను  ప్రేమించాను..నన్ను కాదనకు ....నువ్వు నా వల్ల "పులుపు" తినే  రోజు రావాలని  ఆసిస్తూ'వుంటాను' ...

ఇట్లు 
నీ పురుగు  పట్టని  ఫల్రాజా ..

Thursday, March 11, 2010

Mana "Touch" - - - Feel with me


భావయామి గోపాల బాలం మన సేవితం తర్పధం చింత యే~హం ...భావయామి గోపా ...అనగానే lift చేసి "Hello..!!" అన్నాను
"హలో- చరణ్ - night - Free - aa - ?" అన్నారు మూర్తి గారు ఘటోత్కచుడు సినిమా లో Robot modulation లో
"ఛి.. ఛి.. నేను  అలాంటి వాడిని కాదు సార్" అన్నాను చిరునవ్వు face తో ..
"హ -హ -హ -హ-" అని చాల Careful గా low గా పొడిగా నవ్వారు
"నువ్వు-  pubs -  కి -  వెళ్తుంటావా ?- ఇవ్వాళ -  night -  touch-  కి - రాగలవా?"అన్నారు robot గారు 
"hmm..! అలవాటు లేదు.. కాని ఇవ్వాళ వస్తాను..ఎన్నింటికి Start ?"
"thats - great - leven కల్లా- first bell - కొట్టేస్తారు- sharp leven- కల్లా వచ్చేయ్- అక్కడికి"

"ఫస్ట్ బెల్లా ? hahah...భలే జోక్ చేసారండి..కాని నేను ఒకటి అడుగుతాను మీరేమి అనుకోకూడదు" అన్నాను
"umm-చెప్పు"
" ఎందుకు సార్ మీరు, పాత సినిమాల్లో మాంత్రికుడి గుహ బయట వుండే మర్రి చెట్టు మాట్లాడినట్టు  అలా పట్టి  పట్టి మాట్లాడుతున్నారు?" మళ్లీ పొడి గా "హ హ హ " మని
"ఏం-లేదు-చరణ్ -face కి- Facepack -వేసుకున్నాను- ఇంతకన్నా-active గా- మాట్లాడలేను- నేను ఎంత Activeoo - రాత్రి కి- చూదువ్  లే- హ- హ- హ"
"oo - అదా- సంగతి -  ఇంక - వెళ్లి   -మొహం - కడుక్కోండి - సార్ - ఇప్పటికే- నాలుగు - పెచ్చులు - వూడిపొయాయ్- హ- హ- హ "  అన్నాను  ఆయన  modulationloo
మీరు   "Srujanabhajana" అనే  జనరంజక  blog చదువుతున్నారు ..!

"అయ్యో ~ అయ్యో యీ  bike keys సమయానికి కనపడవే..hu hu hu !! " అని మనసులో అనుకోకుండా, పైకి గోణుగుతున్నాను చేతులు పిసుక్కుంటూ..Quarter to 11 అయింది..ముందు గానే Time అయ్యి అటు ఇటు   హడావుడి గా తిరుగుతూ keys వెతుకుతుంటే మద్యలో ఈ అద్దం ఒకటీ...నేను కనపడినప్పుడల్లా shirtu,pantu Hair stylellu ఒక సారి అలా అనుకోవాలి..!ఇది ఐదో సారి..ఛి...!first time pub experience కి excite అవుతునట్టు నాకే అర్థమవుతోంది.!..."ఇప్పటికే  late అయ్యేంత late అయిపోయింది ..ఆకలి  కూడా అవుతోంది ...ఇక late చెయ్యకుండా మూడు lines lo pub కి వెళ్లిపోవాలి"..అనుకున్నాను

"ఇంకో 20 km easy గా వస్తుంది..రేపు కొట్టించుకోవచ్చు" అని  ఆ పనిని వాయిదావేసి bike start చేసాను..! యాభై లో వెళ్తూ వుండగా నా ముందు splender వాడు వునట్టుండి ఎడమ కాలు చాపేడు, "వామ్మో !!turning తిరిగేటప్పుడు  హైదరాబాద్ వాళ్ళు చేతికి బదులు కాలు చూపిస్తున్నారా  ఏంటి ?" అనుకున్నా కళ్ళు కొబ్బరికాయలంత చేసి..!తరవాత అర్థం అయింది అతను తన pant front pocket లో వున్న cell phone తియ్యటానికి అలా చాపేడూ అని.." కాలు చాపి మాట్లాడటం హానికరం " అని ఊరంతా boards పెడితే  ఎలా  ఉంటుందో అనుకున్నాను..మళ్లీ వద్దులే! అప్పుడు ప్రజలు ఏ పరిస్తితుల్లో కాలు చాపాలన్న భయపడతారు! అని విరమించుకున్నాను.....ఇంత  లో ఒక peeedhha bus నా పక్కనుంచి వెళ్లిపోయింది spare parts అన్ని  కదులుతున్న sounds తో..!aa bus అలా వెళ్ళ గానే నా ఆకలి మాయమైపోయింది..!!minimum 750grams అఫ్ dust తిని ఉంటా..ఆకలి పోక చస్తుందా?..huh!
మెల్లి గా bike ని park బయట pabbu చేసాను I Mean Pubbu బయట Park చేసాను ..O 15 అడుగుల దూరం  లో మూర్తి గారు కనపడ్డారు...ఆయన నన్ను చూడలేదు.. ఆయన్ని చూస్తూ అటుకేసి నడుస్తూ "ఈనకి peralysis stroke ఎప్పుడు వచ్చింది ? నాతో ఎవ్వరూ ఒక్క మాట కూడా చెప్పలేదే ?" అనుకున్న ఆయాన కింది  దవడ అలా పక్కకు పోయివుంటే...జాగర్త గా చూస్తే అప్పుడర్థమైంది..ఆయన తన Car keys ని చెవి లోపెట్టుకొని కెలుకుతూ పరమానందపడుతున్నాడని...ఈలోకం లో లేడు ఆయనా..అమ్మో ఆయాన గుడ్లు రెప్పల్లోకి roll up అయివున్నాయి..! "...సార్.. మూర్తి గారు " అని భుజమ్మీద feather touch ఇచ్చాను .."హేయ్ చరణ్ ...రా లోపలి వెళ్దాం" అన్నాడు చెవిలో పెట్ట్టుకున్న keys తో తన pant మీద Into మార్క్ వేస్తూ ...
మీరు  "Srujanabhajana" అనే జనరంజక  blog చదువుతున్నారు ..!
ఒక చిన్న passage దాటితే లోపలికి enter అవుతా అనగా..pulser 150 cc bike ని start చేసి first gear ఏసి ఉన్నపళంగా వదిలితే ఎలాంటి jerk వస్తుందో అలాంటి jerk వచ్చింది నాలో.. అటు ఇటు చూసుకుంటే ఎవ్వరూ లేరు…వేళ్ళని పేకముక్కల్లా open చేసి..ఆలోచన కళ్ళతో “ఏమో లే” అనుకోని తల దులుపుకున్నా…అంతలోనే  మూర్తిగారు వచ్చి “చరణ్ అంత oke నా ?” అన్నారు “aa..aa.. oke” అంటూ వున్నానూ,నా కాలు నేనే తట్టుకొని పడబోయాను , ఆయన లంచం ఇవ్వటానికి బల్ల కింద చెయ్యి పెట్టినట్టు చెయ్యి పెట్టి నన్ను పట్టుకున్నాడు….Slow గా రావచ్చు గా ?” అన్నాడు.…ఈన formula one race లో injured అయిన  వాడి  దగ్గరకెళ్ళి  కూడా ఇదే అంటాడు!!ఇంక lobby లోకి వచ్చాం ఆయనా వేలు చూపించి rest room కి వెళ్ళాడు నేను ఒక్కడినే Pub room door దగ్గరికి వెళ్తున్నాను…చిన్నగా “dikkumm dikkumm ukkuumm ukkum” అనే sounds బయటకి వినపడుతున్నాయి..!DC paper photographers అక్కడే వున్నారు clichik clichik అని మేరుపుల వర్షం కురిపించారు..! “నాసనమైపోతున్న  నేటి  యువత అని  English లో direct గా కెమెరాలతో రాసేలాగున్నారు , ఒకరి మీద ఒకరు ఎక్కి మరీ photolu తీస్తున్నారు….ఆయనా వచ్చేదాక  అక్కడే wait చేద్దాం అనుకోని వచ్చే పోయే వారిని చూస్తున్నా… 
...అబ్బా!! రకరకాల  అమ్మాయిలు చిట్టి చిట్టి బట్టలు కట్టుకున్నారు,Almost అందరూ sleevlesse వేసుకున్నారు,ఈ చోట బట్ట అనవసరం అనుకుంటే చాలు తీసి పారీసి వచ్చినట్టున్నారు…అమ్మో!! ఈవిడేంటి దుప్పటి చుట్టుకొని వచ్చేసింది?..!వామ్మో ఈమేవరో short top పేరిట shortest top ఏసుకొచ్చింది..!…haaaaaa hayyayooo.. పిల్లేంటి తను వేసుకున్నబట్టల మీద 50% flat discount ఇచ్చేసిందీ..ఈ అమ్మాయి పాపం frustration లో fourth class gown ఏసుకోచ్చేసింది” అని అనుకున్నాను...అంటే ఎప్పుడూ ఇలాంటివి A సినిమాల్లోనో, అర్ధరాత్రి  టీవీల్లోనో  చూడటమే కాని ఇలా ఇంత దగ్గర గా చూడలేదు....expericence చాలా కొత్త గా వుంది,నా బుర్ర లో కొత్త కొత్త threads start అయ్యాయి...మూర్తిగారొచ్చి “చరణ్  అంతా oke నా ?” అన్నారు…aa aa more than oke సార్ ” అని అంటూ అలా పక్కకు చూసా…..నా“ ఆత్మారాం” గాడు ఇంతక ముందు చూసిన 50% discount పిల్ల పక్కనే వున్నాడు తన ear rings తో carom board ఆడుతూ సకిలిస్తూ కనిపించాడు…వీడెప్పుడువచ్చాడబ్బా??అని అలా right side top corner ని చూస్తూ  flash back లో కన్నుతెరిచాను..! చిట్టి బట్టల అమ్మాయిలంతా rewind mode లో వెనక్కి నడుస్తున్నారు..తరవాత నేను కూడా back steps వేస్తున్నాను..నా మీద పడ్డ flash lights అన్ని one by one వెనక్కి వెళ్లిపోతున్నాయి.. నా నుంచి విడిపోయిన మూర్తిగారు వచ్చి నాతో కలిసి lobby లో backsteps వేస్తున్నారు,ఇద్దరం reverse లో నవ్వుకున్నాం,నడుస్తున్నాం…మూర్తి గారు బల్ల కింద నుంచి చెయ్యి తీసేసారు..నేను వెనక్కి తట్టుకొని నిలబడి backsteps వేస్తున్నా … ఇటు అటు చూసి reverse లో pulsar jerk తీస్కున్నాను..మళ్లీ  backsteps వేస్తున్న…కొంచెం forward చేసి చూసా.. 
“Forwardsteps- JERK - అటు ఇటు చూడడం   
revind- “ఇటు  అటు  చూడడం -JERK- Backsteps  
forward, revind, forward, revind .... yessss!! I got him…!! ఆ  pulser jerk వచ్చినప్పుడే  వాడు నాలోనుంచి బయటకొచ్చాడు ..!!ఇంక ఎన్ని ఇబ్బందులు pedathaadooo వీడు, అని అనుకుంటూ వున్నాను  “heey Charan where are you man” అని నా భుజాలు పట్టి ఊపేరు మూర్తి గారు…Come lets go in side” అన్నారు నేను తల విదిలించుకొని ఈ లోకంలోకి రాగానే dikkumm dikkum ukkum ukkum లు  వినపడ్డాయి…“oke oke..lets go” అంటూ మళ్లీ వాడి వైపు చూసా,ఎదవ..!!ఆ పిల్ల నడుం మీద చేతులేసి పరవసిస్తున్నాడు …eei రా!ఇంక చాలు ” అన్నాను గుర్రు కళ్ళతో….“వస్తాలే ! నువ్వు  peehh..!” అని  కళ్ళతో విసుక్కున్నాడు..రేయ్  plz రా  bad name వస్తుంది రా” అని lip movement తో అడ్డుక్కున్న  వాడు అసలు పట్టించుకోలేదు వాడి పని లో నిమగ్నం అయిపోయాడు ..!

(dikkum dikkum) “చరణ్  entrance ఇక్కడ !!” (dikkum dikkum)
“Oke మూర్తిగారు వస్తున్నా”  (dikkkum dikkum)
dikkum  dikkum- Door Open -  DIKKUM JUKKUM DIKKUM UKKUM
అద్దిరి పోయే soundsss…!!ఆ sounds కి నా కర్ణభేరి కలర్ మారిపోయివుంటుంది…ఆ vibrations కి నా  కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రకంపనలు వస్తున్నాయ్..ఒక సారి table fan తిరిగినట్టు,ఈ మూలా నుంచి ఆ మూలా వరకు అలా...తల తిప్పి చూసాను….అందరూ “Right to Dance” అనే fundamental right ని వారి వారి Styles లో పాటిస్తున్నారు,ఆ మసక చీకట్లో Colour బెత్తం తో కొట్టినట్టు laser lightluu..నా పక్కనే ఒకడు music కి తగట్టుగా గాల్లో towel తిప్పే step ఇరగదీస్తున్నాడు…ఇంకొకామె అయితే చెయ్యి  పైకెత్తి ఆకాశాన్ని సుత్తి తో కొట్టే step ఏస్తోంది…ఆ మూల కొందరు rigorous గా జిందాబాదులు కొడుతున్నారు..ఒకడైతే  “Hydrochloric anemic unbelievable Psychic disorder” అనే వ్యాధి తో బాధపడుతున్న వాడిలాగా  అంకాలమ్మ dance ఏస్తున్నాడు …తెగ ఊగిపో తున్నాడు…ఇలాంటి వ్యధిగ్రస్థులూ శాపగ్రస్తులూ ఇంకా చాల stepplu వేస్తున్నారు like cycle pumpu steppu , నడుముతో హారతి పట్టే steppu , ముక్కుతో Vote ఏసే steppu...  అబ్బో!! వద్దులేండి,"...అసలు ఈ మూర్తి గారేరి?" అని కాళ్ళు  పైకెత్తి చూసా, నాలుగైదు Jumping heads మద్య నుంచి peggu దిన్చుతూ కనపడ్డారు..."అప్పుడే ఈన Attack అనేసాడే?" అనుకుని నా చూపు దించే లోగ కనపడ్డాడు ఆత్మారాం గాడు..ఇద్దరమ్మాయిలు పక్కపక్కన వుంటే చాలు వాళ్ళ మద్యలో దూరి చెరుకు మిషన్ లో చెరుకు లా బయటకోస్తున్నాడు....వీడూ "attack" అనేలోగా  వీణ్ని ఆపాలి అని జనాలని తప్పించుకుంటూ వాడి దగ్గరకెళ్ళి "ఏంట్రా  ఏం చేస్తున్నావ్" అన్నాను నేన్ చుసాన్లె నువ్వు చేసేది అన్నట్టు చూసి...."బాబాయ్..ఇందాక ఓ పిల్లని జూసా బాబాయ్...just జూసా అంతే మోక్షమోచ్చినట్లయింది.. దా!! జూపిస్తా " అని నా చెయ్యి పట్టుకు లాగాడు.."ఛి ఛి అలాంటి అమ్మాయిలు నాకేం వద్దు, ఓ మాదిరిగా వుండే అమ్మాయి వుంటే చూపించు" అన్నాను బుద్ధి గా కిందికి చూస్తూ..."eei eei eeei ....నాటకాలోద్దమ్మా.!" అని నా డొక్కలో చనువుగా పొడిచాడు ..నేను చూపుతిప్పుకుంటూ నవ్వు ఆపుకుంటూ నవ్వాను...."బాబాయ్ ఆ పిల్ల జూడు మేర నెంబర్ కబ్ ఆయేగా అన్నట్టు జుస్తాంది..." అని ఒక అమ్మాయిని చూపించాడు...ఆ చూపు లో అంత అర్థం వుందా నాయనా? అన్నట్టు కన్నార్పకుండా వాడి face వైపు తిరిగాను... "అరేయ్ బాబాయ్ నీ పక్కనే  ఒక పిల్ల ఉందీ..sshh !! అబ్బా..!! Mango fruity fresh and juicy Add జూసినట్టు వుంది రా!! కొద్దిగా అట్లా జూడు..అయ్యూ.." అని అన్నాడు పాదాలు పిసుక్కుంటూ చేతులు విదిలించుకుంటూ.."ఊరుకోర, అలా direct గా చుసేస్తారా ఏంటి?..తప్పు కదా!" అన్నాను guilty గా..."పిచ్చివాడ భగవత్గీత లో చిలిపి కృష్ణుడు ఏం అన్నాడో తెల్సా..అతివాం పైత్యం, అధిక ప్రకోపేనా, అతిలోకస్యాం ఆవలింతః అన్నాడు " అని అన్నాడు కృష్ణుడి range లో చెయ్యి పెట్టి ..."వామ్మో..! అంటే ఏంట్రా ? " అన్నాను బిక్క మొహం ఏసీ..అతివల పైత్యం ప్రకోపిస్తే అతిలోక సుందరిని అయినా ఆవలింత వచ్చేదాక జూడచ్చు అని అర్థం...కాబట్టి ఏం పర్లేదు..!! నువ్వు జూడూ..!!" అని నాలో confidence నింపాడు ..."but ఎలా రా ?" అన్నాను..."సరే నేను చెప్పినట్టు చెయ్యి...నువ్వు జూడాలనుకున్న అమ్మాయి ని సెంటర్ లో ఉంచుకో..నువ్వు పైకి జూడూ Room Top ని తరవాత Cross గా  నేలని జూడు మధ్యలో ఆ పిల్లల ని జూడు...center లో పిల్లను జూసేటప్పుడు slow గా జూడు...ఇట్లా రెండు మూడు సార్లు జేయ్యి బొమ్మ fix ఐయిద్ది..అని నన్ను అటు తిప్పాడు...వాడి మాటలు నా మీద పనిమనిషి లా పని చేసాయి, నేను వాడు చెప్పినట్టే  చేసాను ,top నుంచి అలా cross గా వస్తూ కావాల్సిన చోట slow చేస్తూ నేల ని చూసా...వెంటనే  వీడి మొహం చూసా..."ఎలా జరిగింది బాబాయ్ journey ?" అన్నాడు ఆత్రుతగా...నేను  "Heeeeee" అన్నాను పళ్ళు ఇకిలిస్తూ..."తస్సాదియ్యా..! చింపావ్ బాబాయి.." అన్నాడు శిష్యోత్సాహం తో ..."నేనేం చింపలేదు,.... ఆమే చింపుకోచ్చింది" అన్నాను సిగ్గు పడుతూ...నన్ను అలా తదేకం గా చూస్తూ "నీ ఆనందం కోసమే కదా నేను ఇన్ని కస్టాలు పడుతోంది.." అని చూపుడు వేలితో కన్నీళ్లను tick mark లాగ తుడుచుకున్నాడు... "చ్ఛా..." అన్నట్టు చూసా.."సరే బాబాయ్ నాకోసం అక్కడ రెండు మూడు bit papaerlu waiting ..నేను చెప్పింది గుర్తుంది కదా?..పండగ జూస్కో..పండగ చేస్కో "అని వాడి clients ని వెతుక్కుంటూ వెళ్లి పోయాడు..."అమ్మో వీడూ  మామూలోడు కాదు అమ్మాయిలని చూడడం ఎలా? అనే పుస్తకాన్ని రాయటం ఎలా? అనే పుస్తకం గంటలో రాసేయ్ గలడు...వాడు వెళ్ళిపోగానే మళ్లీ dikkum dikkum ukkum లు వినపడడం మొదలయ్యాయి ....ఆ sounds మధ్య వాడు చెప్పినట్టు చేసుకుంటూ పోయా,ఏ అమ్మాయినీ వదిలి పెట్టలేదు,జాతి,మత,చిన్నా,పెద్దా బేధాలు ఈ సారి అస్సలు పట్టించుకోలేదు..    ..నేను వాడిని మారుద్దాం అనుకుంటే వాడే నన్ను మార్చేసాడు..అదే మంచిదైంది లే అనుకున్నా..sudden గా heroin వేద కనపడింది "హాయ్.." అని ఇటు తిరిగా రోహిత్ కనపడ్డాడు..."arey ..!" అని ఆ పక్కన చూసా శివబాలాజీ కనపడ్డాడు ఇంతలో తనీష్ వచ్చాడు...ఇదేంటిది రాంగోపాల్ వర్మ సినిమా climax లో అందరూ దయ్యాలు అయినట్టు..ఇక్కడ అంతా film stars అయిపోతున్నారూ ? అనుకున్నా...ఏమైనా మాట్లాడదాం అంటే ఒకటే soundu..!!ఇంతలో మూర్తి గారు వచ్చి"చరణ్ అంతా oke నా..?" అన్నారు..జాగర్త గా చూస్తే కాస్త drowsy గా వున్నారు..."సార్ మీరు ఒకే నా?" అన్నాను..yeah am oke అని slow గా రెప్ప కొడుతూ అన్నారు.."ఇక వెళ్దామా ?"  అని సైగ చేసాను..ఇద్దరం door తీసి అగుడు బయట పెట్టాం.. 
 DIKKUM JUKKUM DIKKUM UKKUM ... - Door Close - ... dikkum  di... kkum..mm 

నడుస్తున్నాం..నాకు ఆ sounds బుర్ర లో ఇంకా తిరుగుతూనే వున్నాయి..ఆయాన sudden గా తూలారు..నేను కూడా బల్ల కింద చెయ్యి పెట్టి పట్టుకొని help లో tit for tat ఇచ్చాను..."సార్ ఇంటికి జాగర్త గా వెళ్ళగలరా?..r u sure ??" అన్నాను.."ఇది నాకు మామూలే ..Dont worry Gudnight !!" అంటూ study గా నడవటానికి try చేస్తూ వెళ్ళిపోయారు... 

నడుస్తూ నా Bike దగ్గరికి వెళ్తున్నాను,చుట్టూ అంతా silent గా ఉంది నాకు ఏదోలా అనిపించింది..ఇంతసేపు  నేను ఏం చేసాను?? అని pub లో నా behavior ని తల్చుకున్నాను..చాలా guilty గా అనిపించింది.. ఉన్నట్టుండి నా phone... భావయామి గోపాల బాలం మన సేవితం తర్పధం చింత యే~హం ...భావయామి గోపా బాలం మన సేవితం తర్పధం చింత... అని మోగుతోంది..ఒక్కసారి ఆమె పాట వినగానే మనసంతా హాయి గా మారిపోయింది,అలా వింటూ వుండిపోవాలనిపించింది,సంవత్సరం రోజుల తరవాత అమ్మను చూసినట్టు అనిపించింది..మనమేంటో,మన Culture ఏంటో గుర్తోచింది,మన Traditions వీటి కన్నాఎన్నిరెట్లు గొప్పవో అర్థమైంది ..ఇలాంటి పబ్బులు వంద పెట్టినా నా Ringtone కాలి గోటి కి కూడా సరిపోవనిపించింది..గర్వం నిండిన మనసుతో bike start చేసి ఇంటికి బయలుదేరాను...!  

మీరు "Srujanabhajana" అనే జనరంజక blog చదివేసారు !!

Thank you
Regards
Guru Charan Sharwany




Saturday, August 23, 2008

Bhaavaaveesam

హాయ్
అమ్మ--- గురు చరణ్
అమ్మ గొప్పతనం ఏంటి ? అన్న మీ ప్రశ్నకు నా సమాధానం నిశబ్దం అవతుంది,ఎందుకంటే ఎక్కడ నుంచి మొదలెట్టాలో తెల్చుకోలేను కనుక !!!"

ప్రేమ--- గురు చరణ్
ప్రేమ proove అవ్వాలి ...proove చేసుకోకూడదు ........

ప్రేమ-- గురు చరణ్
"ప్రేమించడం ఆపేస్తే పెద్ద బాధ ఏమి వుండదు ర ....ప్రేమించబడడం ఆగిపోతే చాలా బాధగా వుంటుంది "

guru
"నా మౌనం చేతకాని తనం అనుకుంటే ...నా చేతులు మౌనం వహించవ్ "

అమ్మ - గురుచరణ్
"అమ్మ అందరికి వుంటుంది కాని అమ్మతనం అందరికి వుండదు "

లవ్ - గురుచరణ్
"నా వ్యాపకమే నువ్ అవుతావు అనుకున్నా ,ఇలా జ్ఞాపకం అవుతావ్ అనుకోలేదు "

క్యారెక్టర్ - గురుచరణ్
"నేను మోహ మాటానికి ప్రేమించను ,ప్రేమించటానికి మొహమాట పడను"

కంట్రీ- గురుచరణ్
"దేశాని కన్నా ..దేశ భక్తుడు మిన్న "

పంచాయితి పెద్ద డైలాగ్ -గురుచరణ్
""తప్పు చేసిన వాడి స్థానం లో వున్నది నా రక్తం పంచుకున్న వాడైనా నాకు రక్తం పంచిన వాడైన సరే క్షమించను."

సక్సెస్-- గురు చరణ్
"ఓటమి ఎరుగవు అంటే గెలుపులోని తియ్యదనం పూర్తిగా తెలీదు అని అర్థం "

చిరు పొలిటికల్ ఎంట్రీ --- గురుచరణ్
"అతని మౌనమే రాష్ట్రాన్ని ఏలుతుంది ...ఇక పెదవి విప్పితే ప్రభుత్వం ఏర్పడదా .."

లవ్ ---గురుచరణ్
"ప్రేమ లోనూ పేకాటలోనూ ప్రతీ సారీ గెలవలేమ్"

క్రియేటివ్-- గురు చరణ్
"even though you COPY the imagination still its CREATIVITY"

భాద ---గురుచరణ్
"కంచం ముందు చెయ్యి తడిగా వుండాలి కాని కళ్లు తడిగా వుండ కూడదు "

లవ్ ---గురుచరణ్
ప్రేమించటానికి ప్రేమించటం తెలియాలి కాని నీ గురించి తెలియక్కర లేదు "

daughter says to his Father--- గురుచరణ్
"ప్రేమ అనే ముసుగులో మోసం చేయ్యమన్నావ్ ,మోసం అనే ముసుగులో ప్రేమించా"

తపన -----గురుచరణ్
"నా రాతలు నిజం కాక పొవచు ,కాని రాయాలన్న నా తపన మాత్రం నిజం .

సందర్భం -----గురుచరణ్
"ప్రేమ కి నమ్మకం ఎంత ముఖ్యమో,సామెత కి సందర్భం అంత ముఖ్యం "

స్నేహం ------గురుచరణ్
"సాయం చేసి ఆశిస్తే తప్పు ,స్నేహం చేసి ఆశిస్తే తప్పులేదు "

తపన -----గురుచరణ్
"ఎందుకు తపన తీరలేదు అనే బాధ ,తపన వుండటమే అదృష్టం కాదా ?"

విలువ ----గురుచరణ్
"విలువలు కాపాడాలి అనుకునే వారికి విలువ లేదు "

మోసం ----గురుచరణ్
"నమ్మిన వారిని చంపడం కన్నా పెద్ద నేరం ,వారిని మోసం చేయడం "

ప్రేమ ---గురుచరణ్
"ప్రేమ నటించటం కష్టం ,ప్రేమించటం తేలిక "

Romantic One------గురుచరణ్
"నీ తలపే నాకు ఇంధనం ,నీ వలపుకు చేస్తా వందనం ":-)

డైలాగ్ లాంటిది -----గురుచరణ్
"మనం infosys లో పని చేస్తున్న TCS లో పని చేస్తున్నా .....తుమ్మినప్పుడు మాత్రం ......SATYAM అనే అంటారు ":-)

అమ్మ ----గురు చరణ్
"మా అమ్మ మొహం లో చిన్న పాటి కంగారుకు కారణం నా ఆనందభాష్పాలు ఐతే అవి నాకు వద్దు "

తొందరపాటు -------గురుచరణ్
"ఆశ పడు ఆత్ర పడకు "

ఓటమి ------గురుచరణ్
"నేను తప్పు ఒప్పుకుంటాను కాని ఓటమిని ఒప్పుకోను "

ఓటమి ------గురుచరణ్
"ఊతమిని మరిచిపో ,అది నేర్పిన పాఠాన్ని మరువకు "

కష్టాలు------గురుచరణ్
"దేవుడా ప్రత్యక్షం అవ్వయ్యా అంటే ప్రతిపక్షం అయ్యావా ?"
a Film producers says to audience--గురుచరణ్
"Theater లో మీ రెండు వెళ్ళు నోట్లోకి వెళితేనే మా నాలుగు వేళ్ళు నూట్లోకి వెళ్తాయి "

Ability----గురుచరణ్
"నాకు ఈ ప్రపంచం లో చేతకానిది ఒక్కటే చేత కాదు అని చెప్పటం "

అందం ----గురుచరణ్
"అందం ఆకర్షించటానికి పనికొస్తుంది కాని అర్థం చేసుకోవటానికి పనికి రాదు"

భార్య ------గురుచరణ్
"పెళ్ళికి ముందు ఓ చూపు చూసింది పడిపోయా ,ఇప్పుడు ఓ చూపు చూసుకుంటోంది ";-)

Talent----గురుచరణ్
"నీలో talent వుంది అని నువ్వు నమ్ము ,తరవాత ఈ దేశమంతా నిన్నే నమ్ముకుంటుంది "

Work----గురుచరణ్
"చేసే పని ని ప్రేమించకు , ప్రేమించే పనినే చెయ్యి "

Leadership----గురుచరణ్
"దారి చూపటానికి అర్హత వుండాల్సిన అవసరం లేదు ,ఆలోచన వుంటే చాలు "

Feedback----గురుచరణ్
"అభినందిస్తే ఆనందిస్తా ,విమర్శిస్తే ప్రశంసిస్త !!"

NRI says----గురుచరణ్
"మేము దేశానికి దూరంగా వుంటున్నాం ,దేశ భక్తి కి దూరంగా వుండట్లేదు "

Interest----గురుచరణ్
"అభిరుచి వుండాలి కాని అసాధ్యం అంటూ వుండదు "

గెలుపు ----గురుచరణ్
"మన గెలుపు మన కంటే ముందుగా మన ప్రత్యర్థులకు తెలియాలి "

Cast----గురుచరణ్
"Cast మనుషులని CATOGARISE చేస్తుంది కాని DIFFERENTIATE చెయ్యదు "

use her name----గురుచరణ్
"మీకు ఏ పని అవ్వలన్నా ఆ పని తనది అని చెప్పండి ,అయిపోతుంది ":-)

Comparing----గురుచరణ్
"పోల్చుకుంటూ బ్రతికితే ,తరవాత తలచుకోవటానికి ఏమీ వుండదు "
స్నేహం ----గురుచరణ్ "ఆకలి రుచి ఎరుగదు ,నిద్ర చోటు ఎరుగదు ,స్నేహం మతం ఎరుగదు "

నిరుద్యోగి ----గురుచరణ్
"నిరుద్యోగి ఆకలేస్తే అన్నం దొరకాలి అనుకోడు ,పని దొరకాలి అనుకుంటాడు "

పోరాటం ----గురుచరణ్
"ఆస్తులు కోసం పోరాడకండి ఆశయాల కోసం పోరాడండి "

Control----గురుచరణ్
"ఇంద్రియాలను నియంత్రించ గలిగిన వాడు ప్రపంచాన్ని శాసించగలడు "

Abt me----గురుచరణ్
"ఊహలు నా నేస్తాలు ,ఆలోచనలు నా బంధువులు,రాతలు నా తీపి గుర్తులు "

Goal----గురుచరణ్
"కలలో కూడా నీ కలను మరువకు "

Love----గురుచరణ్
"మనం రోజు లో ఎన్ని సార్లు మాట్లాడుకున్నాం అనేది కాదు ,నిమిషానికి ఎన్ని సార్లు ఒకరినొకరు తల్చుకున్నాం అనేది ముఖ్యం "

కార్య సాధకుడు ----గురుచరణ్
"జైత్ర యాత్ర చెయ్యాలనుకునే వాడు తీర్థయాత్రలు చెయ్యడు"

Friends----గురుచరణ్
"మనం కలవటం దైవ నిర్ణయం కావచ్చు ,కాని విడిపోవటం మాత్రం మన నిర్ణయం అవ్వాలి "

తప్పు ----గురుచరణ్
"తప్పు ఒప్పుకోవటం సగం దిద్చుకోవడంతో సమానం "

అలక ----గురుచరణ్
"అలక లో తన కోపం చూడకు ,బతిమాలుకుంటాడు అనే నమ్మకం చూడు "

no pains no gains----గురుచరణ్
"రాయి ఉలిని వలచింది మూర్ఖంగా ,ఉలి రాయిని మలిచింది శిల్పంగా "

అమ్మ ----గురుచరణ్
"అమ్మ యిచ్చిన తొలి వరం జన్మ ,జన్మించిన తొలి పదం అమ్మ "

+ve thinking of a blind person----గురుచరణ్
"సూర్యుడు చీకటితో పోరాడ గలడు చీకటి లో పోరాడలేడు,కాని నేను రెండూ చెయ్యగలను "

విలువ ----గురుచరణ్
"Bullet లేధు అని తెలిసే దాకా గన్ను కి విలువ ,మనసు లేదు అని తెలిసే దాకా మనిషికి విలువ "

శృంగారం ----గురుచరణ్
"అంగ సౌష్టవం లో ఏముంది విశిష్టత,మనలో వుండాలి రసికత ":ప

between friends----గురుచరణ్
"ఓ దూరం మన మధ్య వచ్చి తప్పు చేసింది ,దాన్ని పెంచి మనం తప్పు చేయకూడాదు "

soldier----గురుచరణ్
"కధ అన్నాక ముగింపు వుండాలి ,సైనికుడు అన్నాక తెగింపు వుండాలి "
"చమట ఉప్పగా వుంటుంది ,కాని అది అందించే గెలుపు తియ్యగా వుంటుంది "

Philosophy----గురుచరణ్
"అప్పుడప్పుడు వేదాంతం మాట్లాడే వాడు మనిషి ,ఎల్లప్పుడూ వేదాంతం మాట్లాడే వాడు ఋషి "

Satisfaction----గురుచరణ్
"గెలవడం లో సంతోషం వుంటుంది ,నిజాయితి గా గెలవడం లో సంతృప్తి వుంటుంది "

గొప్పవారు ----గురుచరణ్
"గొప్పవాడు విమర్శల కోసం చూస్తాడు ,గొప్ప అవ్వాలి అనుకునే వాడు పొగడ్తల కోసం చూస్తాడు "

లవ్ ----గురుచరణ్
"నాయకుడు ఎక్కడున్నా నాయకుడే ,ప్రేమికుడు ఎక్కడున్నా ప్రేమికుడే "

కళల (art)----గురుచరణ్
" కోయిల అరిచినా పాట అనుకుంటారు ,కాకి పాడినా అరుపు అనుకుంటారు ........కాకి పాటని కూడా గుర్తించండి ,కళలను ఎక్కడున్నా ఆదరించండి "

విజయాలు ----గురుచరణ్
"సాధించిన విజయాలన్నింటిని తలచుకుంటున్నావ్ అంటే ఇప్పుడు నువ్వు ఖాళీగా వున్నావ్ అని అర్థం "

Excusing----గురుచరణ్
"సాయం చేసిన వాడిని మోసం చేసిన వాడిని ఎప్పటికీ మరిచిపోకు ,సాయపడిన వాడిని దీవిస్తూ వుండు ...మోసం చేసినవాడిని క్షమిస్తూ వుండు "

అమ్మ ----గురుచరణ్
"ఎంతమందిలో అయినా ,నువ్వు ఎంత వాడివి అయినా..అమ్మ తిడితే అవమానం అనుకోకు ఆశీర్వాదం అనుకో "

లవ్ ----గురుచరణ్
"ప్రేమించిన మనిషి మోసం చెయ్యచ్చు ,కానీ ప్రేమించిన మనసు మోసం చెయ్యదు ..మోసం నీది , మనసు నాది "

కోపం ----గురుచరణ్
"నీ కోపానికి విలువ లేదు అంటే ,నీకు విలువ లేనట్టే "

అందం ----గురుచరణ్
"అందం గుణంతో ముడిపడి లేదు ,మన చూపుతో ముడిపడి వుంది "

సాయం ----గురుచరణ్
"నాకు సాయం చేస్తే నీకు పుణ్యం వస్తుంది కాని ,నా మీద హక్కు రాదు "

జీవితం ----గురుచరణ్
"వింతలన్నీ ఓ చోట వుంటే Museum అంటారు ,చింతలన్ని ఓ చోట వుంటే .......జీవితం అంటారు "

దేశం ----గురుచరణ్
"దేశం అంటే అభిమానం వుండాలి ,దేశాన్ని ఏమైనా అంటే ఆవేశం రావాలి "

దురదృష్టం ----గురుచరణ్
"అతి పెద్ద దురదృష్టం ..నీకు కోపం వచ్చింది అని నువ్వే చెప్పుకోవాల్సి రావడం "

అడ్డంకులు -- గురుచరణ్
"నీ దారిలో ముళ్ళు వుంటే భయపడకు, ముళ్ళు లేకుంటే భయపడు"

ప్రేమ ----గురుచరణ్
"బద్ధకం నిర్లక్షం కొంత పని కూడా చేయనియ్యవు ,కాని ఆకలి, ప్రేమ ఎంత పనైనా చేయిస్తాయి"

మాటలు ----గురుచరణ్
"మన మాటలు మనసు కి హతుకునే లా వుండాలి ,మనసుకి గుచ్చుకునేలా వుండకూడదు "

బాష ----గురుచరణ్
"బెదిరింపుకు భాష అవసరం లేదు ,కాని ......ఓదార్చటానికి అది చాలా అవసరం "

లాభం ----గురుచరణ్
"వ్యాపారం లోనూ శృంగారం లోనూ ఎవరి లాభం వారు చూసుకోవాలి "

కోపం-- గురు చరణ్
"కోపం ఒస్తే తప్పు కోపం తెచ్చుకుంటే తప్పు "

Capacity----గురుచరణ్
"డబ్బులు లేని వాడే పేదవాడు అవుతాడు కాని పిరికి వాడు కాదు ,కాలు లేని వాడు కుంటి వాడు అవుతాడు కాని చేత కాని వాడు కాదు "

ప్రేమ ----గురుచరణ్
"నీ ప్రేమ నేగ్గదు" అని జోస్యం చెప్పాను తను నెగ్గించుకుని ప్రేమ కి భాష్యం చెప్పింది ..

ప్రేమ -- గురుచరణ్
శిక్షించావు నన్ను ఏ నేరాన ??
ఐనప్పటికీ నీతోనే రానా !!!

బాధ -- గురుచరణ్
సుఖల్లోనే నవ్వాలి అనుకున్నా కాని నవ్వలేకపోయా.. బాధలోనే నవ్వాలి అనుకున్నా ..నవ్వుతూనే వున్నా ..

భయం-- గురుచరణ్
భయపడే వారిని భయపెట్ట కూడదు, భయపెట్టే వారిని భయపెట్టాలి ..

ఓ తండ్రి మాట -- గురుచరణ్
ఎనిమిదేళ్ల కొడుకు చనిపోతే.. ఏనిమిదేళ్ళ తర్వాత తుఫ్ఫాను ఒస్తే ఎలా వుంటుందో అలా వుంటుంది ..
ఇరవైమూడేళ్ళ కొడుకు చనిపోతే, తుఫ్ఫాను వచ్చి ఇరవైమూడేళ్ళు వుంటే ఎలా వుంటుందో అలా వుంటుంది..

సాయం--గురుచరణ్
ఏప్పుడైనా సాయపడతాడు అని పరిచయం చేసుకోకు, ఏప్పుడైనా సాయపడదాము అని పరిచయం చేసుకో...

blaming--gurucharan
మంచి జరిగినపుడు అంతా నీవల్లే అనకపోయినా పర్లేదు..చెడు జరిగినపుడు మాత్రం అంతా నీవల్లే అనకూడదు..

లవ్--గురుచరణ్
కలిసి బ్రతుకు పంచుకుంటాం అనుకున్నాము. ఇలా బాధ పంచుకుంటాం అనుకోలేదు..

మాట -- గురుచరణ్
ఎం మాట్లాడుతున్నావో తెలిసినపుడు, ఎవరితో మాట్లాడుతున్నావో తెలియాల్సిన అవసరం లేదు..

ప్రేమ-- గురుచరణ్
ప్రేమించే వారికే ప్రేమను ఆశించే హక్కు వుంటుంది